కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు | CBI to send Letters Rogatory to the US, UK, France, Hong Kong | Sakshi
Sakshi News home page

కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు

Apr 13 2016 12:21 AM | Updated on Sep 3 2017 9:47 PM

కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు

కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు

పారిశ్రామికవేత్త విజయ్ మాల్యకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్...ఐడీబీఐ బ్యాం క్ నుంచి తీసుకున్న రుణాల తరలింపు ఆరోపణలకు

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త విజయ్ మాల్యకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్...ఐడీబీఐ బ్యాం క్ నుంచి తీసుకున్న రుణాల తరలింపు ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని కోరుతూ అమెరికా, బ్రిటన్‌లతో సహా ఐదు దేశాలకు సీబీఐ త్వరలో జ్యుడీషియల్ విజ్ఞప్తి లేఖలు పంపనుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ నుంచి తగిన వివరాలు అందడంతో ఆయా దేశాలను సంప్రదించాలని సీబీఐ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ ఇప్పటికే ఈ లేఖల్ని రూపొందించిందని, వాటిని బ్రిటన్, అమెరికా, హాంకాంగ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు పంపుతుందని ఆ వర్గాలు తెలిపాయి.ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 930 కోట్ల రుణంలో అధికభాగం ఇతర దేశాలకు తరలివెళ్లినట్లు సీబీఐ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement