‘ఫేస్‌బుక్‌ డేటా’ దెబ్బతో దివాలా! | Cambridge Analytica files for bankruptcy in US after Facebook data scandal | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్‌ డేటా’ దెబ్బతో దివాలా!

May 19 2018 12:44 AM | Updated on Jul 26 2018 5:23 PM

Cambridge Analytica files for bankruptcy in US after Facebook data scandal - Sakshi

న్యూయార్క్‌: ఫేస్‌బుక్‌ యూజర్ల వివరాలను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టింగ్‌ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా.. అమెరికాలో దివాలా పిటీషన్‌ వేసింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ఆస్తులు సుమారు 1– 5 లక్షల డాలర్ల మధ్య ఉంటాయి.

రుణాలు 10 లక్షలు– కోటి డాలర్ల మధ్య ఉన్నాయి. బ్రిటన్‌లోనూ దివాలా పిటీషన్‌ వేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కారణంగా తమ వ్యాపారం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కి అనుకూల ఫలితాలు వచ్చేలా.. లక్షల సంఖ్యలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందంటూ కేంబ్రిడ్జ్‌ అనలిటికాపై ఆరోపణలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement