బీఎస్‌ఎన్‌ఎల్ లోన్‌ టాక్‌టైమ్‌ ప్లాన్‌‌

BSNL Offers Talktime Loan Credits - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఉదృతి నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అధిక టెలికాం కంపెనీలు రూ.200 దాటిన డిజిటల్‌ రీచార్జ్‌లనే అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు స్టోర్స్‌లోకి వెళ్లి రీచార్జ్‌ చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎగువ నుంచి దిగువ తరగతి కస్టమర్లకు లాభం కలిగించే విధంగా సరికొత్త టాక్‌టైమ్‌ లోన్స్‌(రుణాలు)తో ముందుకొచ్చింది. టాక్‌టైమ్‌ లోన్స్‌ ప్రారంభ ధర రూ.10 నుంచి 50 రూపాయల వరకు వినియోగదారులు లోన్‌ తీసుకునే అవకాశం కల్పించింది. అయితే టాక్‌టైమ్‌ లోన్స్‌(రుణాలు) కావాలనుకునే వారు యూఎస్‌ఎస్‌డీ (USSD) కోడ్‌(*511*7#)లో నమోదు చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

ఈ కోడ్‌ నమోదు చేసుకోగానే వినియోగదారులకు దృవీకరించినట్లు ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎమ్‌ఎస్‌లో లోన్‌కు సంబంధించిన వివరాలుంటాయి. వినియోగదారులకు కావాల్సిన రీచార్జ్‌ నెంబర్లు ఉంటాయి. రీచార్జ్‌కు‌ కావాల్సిన నెంబర్‌ను ఎంచుకొని సెండ్‌ ఆఫ్షన్‌ క్లిక్‌ చేస్తే లోన్‌ రీచార్జ్‌ అవుతుంది. కాగా, మెరుగైన సేవల కోసం వినియోగదారులు మై బీఎస్‌ఎన్‌ఎల్‌ యాప్‌లో లాగిన్‌ అ‍య్యాక  గో డిజిటల్‌ ఆఫ్టన్‌ను సెలక్ట్‌ చేయాలని తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ .18తో కాంబో ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.8 జీబీ డేటాను, 250 నిమిషాల ఉచిత కాల్‌ టాక్‌టైమ్‌‌ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 2 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. 

రూ .108 ప్లాన్: ఈ ప్లాన్‌ ద్వారా 1జీబీ డేటాతో పాటు 500 ఎస్ఎంఎస్‌లను  60 రోజుల కాలపరిమితిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. (రూ .153 ప్లాన్):ఈ ప్లాన్‌ ద్వారా   ప్రతి రోజు 1 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్‌లను 180 రోజుల కాలపరిమితితో పొందవచ్చు. (రూ .186 ప్లాన్): ఈ ప్లాన్‌ ద్వారా  ప్రతి రోజు 2 జీబీ, 100 ఎస్ఎంఎస్‌లను 180 రోజుల కాలపరిమితో పొందవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top