ఎన్సీసీలో బ్లాక్స్టోన్ 3% వాటాల విక్రయం | Blackstone sells 3.25 per cent stake in NCC | Sakshi
Sakshi News home page

ఎన్సీసీలో బ్లాక్స్టోన్ 3% వాటాల విక్రయం

Aug 26 2016 1:13 AM | Updated on Sep 4 2017 10:52 AM

ఎన్సీసీలో బ్లాక్స్టోన్ 3% వాటాల విక్రయం

ఎన్సీసీలో బ్లాక్స్టోన్ 3% వాటాల విక్రయం

బ్లాక్‌స్టోన్ జీపీవీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (మారిషస్) సంస్థ ఇన్‌ఫ్రా కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో 3.25 శాతం వాటాలను విక్రయించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్లాక్‌స్టోన్ జీపీవీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (మారిషస్) సంస్థ ఇన్‌ఫ్రా కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో 3.25 శాతం వాటాలను విక్రయించింది. 2015 ఏప్రిల్ 10 నుంచి 2016 ఆగస్టు 24 మధ్య కాలంలో  ఓపెన్ మార్కెట్ లావాదేవీ రూపంలో 1.80 కోట్ల షేర్ల విక్రయం జరిగినట్లు ఎన్‌సీసీ తెలిపింది. షేర్ల విక్రయానంతరం ఎన్‌సీసీలో బ్లాక్‌స్టోన్ వాటా 10.24 శాతం నుంచి 6.99 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్‌సీసీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 1,930 కోట్లుగాను లాభం 26 శాతం పెరిగి రూ. 52 కోట్లుగాను నమోదైంది. కంపెనీ షేరు గురువారం బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 83.95 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement