తెలంగాణ మార్కెట్లోకి భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌ | Bharathi cement launches new product " Bharati Ultra fast" | Sakshi
Sakshi News home page

తెలంగాణ మార్కెట్లోకి భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌

Aug 17 2018 12:56 AM | Updated on Aug 17 2018 12:56 AM

Bharathi cement launches new product " Bharati Ultra fast" - Sakshi

మేడిపల్లి: సిమెంట్‌ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్‌ మరో ముందడుగు వేసింది. అల్ట్రా ఫాస్ట్‌ పేరుతో అత్యాధునిక సిమెంట్‌ను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో మొదటిసారిగా మేడిపల్లిలోని సవేరా ఏజెన్సీస్‌ ద్వారా గురువారం ఈ ఉత్పాదనను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.సి.మల్లారెడ్డి, సీజీఎం కొండల్‌రెడ్డి, చీఫ్‌ మేనేజర్‌ సతీష్‌రాజులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే అత్యాధునిక టెక్నాలజీతో తయారవుతున్న భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ఈ సిమెంట్‌ ద్వారా ఒక్కరోజులోనే సెట్టింగ్‌ పూర్తి అవుతుందని వారు చెప్పారు. ముఖ్యంగా స్లాబ్‌లు, సిమెంట్‌ పైపులు, ఇటుకల తయారీకి ఈ అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌ సరైన ఎంపిక అని వివరించారు. మార్కెట్‌లో లభించే మిగతా సిమెంట్ల కన్నా దీని ధర సుమారు రూ.20 అధికంగా ఉంటుందని తెలిపారు.

ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో మొదటిసారిగా 1,000 మంది ఫైవ్‌స్టార్‌ సిమెంట్‌ డీలర్ల సమక్షంలో ఈ ఉత్పాదనను సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎం.రవీందర్‌రెడ్డి విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్‌ మేనేజర్‌ వేముల నీరజ్, సవేరా ఏజెన్సీస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ శంకర్‌రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

నిర్మాణం మరింత సులభతరం: భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌ సెట్టింగ్, కలర్, చాలా అత్యుత్తమంగా ఉన్నాయని మొదటి వినియోగదారుడు జగన్నా«థ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సిమెంట్‌ ద్వారా నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా, సులువుగా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్మాన్‌ఘాట్‌ గాయత్రినగర్‌లోని ఆయన సైట్‌లో మొదటిసారిగా అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌ను వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement