చోళ జనరల్ ఇన్సూరెన్స్తో బీఓబీ ఒప్పందం | Bank of Baroda commemorates 109th foundation day | Sakshi
Sakshi News home page

చోళ జనరల్ ఇన్సూరెన్స్తో బీఓబీ ఒప్పందం

Jul 22 2016 1:31 AM | Updated on Sep 4 2017 5:41 AM

చోళ జనరల్ ఇన్సూరెన్స్తో బీఓబీ ఒప్పందం

చోళ జనరల్ ఇన్సూరెన్స్తో బీఓబీ ఒప్పందం

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తాజాగా చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తాజాగా చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎస్.గోపాల్ రత్నం... బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పి.ఎస్.జయకుమార్‌లు కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్‌ను మార్చుకున్నారు. దీని వల్ల బ్యాంకు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌ను చెందిన పలు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ను తన కస్టమర్లకు అందించనున్నది. తాజా భాగస్వామ్యం వల్ల ఇరు సంస్థలు ప్రయోజనం పొందుతాయని, దీని వల్ల తమ కస్టమర్లకు పలు బీమా పథకాలను అందించడం వీలవుతుందని బీఓబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మాయంక్ కె మెహ్‌తా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement