బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే! | Bank credit up 10.39% at Rs 64,53394 crore, lags deposit growth | Sakshi
Sakshi News home page

బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే!

Mar 7 2015 12:58 AM | Updated on Sep 2 2017 10:24 PM

బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే!

బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే!

ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు అద్దంపట్టే బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు పేలవంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు తెలిపాయి.

ముంబై: ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు అద్దంపట్టే బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు పేలవంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి 20వ తేదీతో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకింగ్ రుణం వార్షికంగా రూ.64,53,394 కోట్లుగా ఉంది. 2014 ఇదే కాలానికి బ్యాంకింగ్ రుణం రూ.58,45,833 కోట్లు. అంటే కేవలం వార్షికంగా రుణ వృద్ధి రేటు 10.39 శాతం పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని రుణ వృద్ధి తీరు వెల్లడిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. ఇక రుణ డిమాండ్ కన్నా అధికంగా డిపాజిట్ల పరిమాణం పెరుగుదల ఉంది. ఈ పరిమాణం 11.85 శాతం వృద్ధితో రూ.75,76,609 కోట్ల నుంచి రూ.84,74,824 కోట్లకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement