2020లో ఎలక్ట్రిక్‌  వాహనాల్లోకి బజాజ్‌ 

Bajaj Auto looking to enter electric vehicles space by 2020 - Sakshi

రాజీవ్‌ బజాజ్‌ ప్రకటన

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో 2020 నాటికి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లోకి ప్రవేశించనుందని ఆ సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఈ విభాగం ఆకర్షణీయమైనదిగా చెప్పారాయన. వచ్చే 12 నెలల కాలంలో మార్కెట్‌ వాటాను 15– 20 శాతం స్థాయి నుంచి 20–25 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ‘‘రెండేళ్ల కాలంలోనే 10 శాతం మార్కెట్‌ వాటాను సాధించడం మామూలు విషయం కాదు. ఇది 35 ఏళ్లుగా భారత్‌లో ఉన్న యమహా మార్కెట్‌ వాటాతో పోలిస్తే మూడు రెట్లు’’ అని రాజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వచ్చే కొన్ని నెలల పాటు సమస్యలుంటాయా? అన్న ప్రశ్నకు... ఆసక్తికరమైన ధోరణులతో ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన బదులిచ్చారు. ఎగుమతులకు సంబంధించి మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని, అయినా 2018 చివరికి కంపెనీ 20 లక్షల యూనిట్లను 70 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారాయన.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top