బజాజ్‌ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్‌ | Bajaj adds electric start to CT100, priced at Rs 38,806 | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్‌

Aug 23 2017 4:43 PM | Updated on Sep 5 2018 2:28 PM

బజాజ్‌ ‘సీటీ 100’  సరికొత్తగా లాంచ్‌ - Sakshi

బజాజ్‌ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్‌

బజాజ్‌ ఆటో తన పాపులర్‌ బైక్‌ సీటీ 100 లో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

బజాజ్‌ ఆటో తన పాపులర్‌ బైక్‌ సీటీ 100  లో అప్‌గ్రేడెడ్‌   వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ తో  ఆధునీకరించిన సీటీ 100 అల్లాయ్ ఈఎస్‌ను బుధవారం ఇండియన్‌ మార్కెట్లో  విడుదల చేసింది.దీని ధరను రూ.38,806 గా నిర్ణయించింది.

విశ్వసనీయత, నాణ్యత మరియు సుపీరియర్ ఇంధన సామర్థ్యంతో కస్టమర్లకు  'జాక్పాట్' గా  ప్రసిద్ధి చెందిన   సీటీ 100  న్యూ లుక్‌తో లాంచ్‌ చేసింది.   పరిమితం కాలానికి దేశవ్యాప్తంగా అన్ని అధికారం బజాజ్ ఆటో డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. 

ఇక ఫీచర‍్ల విషయానికి  వస్తే..వినూత్నమైన  స్ప్రింగ్ సస్పెన్షన్ స్ప్రింగ్ టెక్నాలజీ , విప్లవాత్మకమైన 103 సీసీ సింగిల్‌ ఇంజీన్‌, 4-స్ట్రోక్ పెట్రోల్ మోటార్‌, 7.7 పీఎస్‌ పవర్‌,  8.24ఎన్‌ఎం టార్క్‌  తదితర ఫీచర్స్‌తో ఒక ఆకర్షణీయమైన కొత్త డెకాల్ డిజైన్‌తో రూపొందించింది.  అలాగే  ఫ్యూయల్‌ గేజ్ , ఫెక్సిబుల్‌ సైడ్‌ ఇండికేటర్స్‌ను అమర్చింది.  మూడు రంగుల ఆప్షన్స్‌లో ఇంది అందుబాటులో ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్టార్ట్  సౌలభ్యంతో ఇది వినియోగదారులకి గొప్ప మైలేజిని అందిస్తుందని బజాజ్ ఆటో లిమిటెడ్ అధ్యక్షుడు మోటార్ ఎరిక్ వాస్  తెలిపారు.  రూ.38,806 ఆరంభ ధరలో  సీటీ 100 ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్, ఎంట్రీ లెవల్ 100 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనిచూస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement