ఐదేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు  | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు 

Published Thu, May 9 2019 12:19 AM

 AURIC to attract Rs 70000 cr investment in 5 yrs: Gajanan - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔరంగాబాద్‌ ఇండస్ట్రియల్‌ సిటీ (ఏయూఆర్‌ఐసీ) దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్‌ పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (డీఎంఐసీడీసీ), మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఐడీసీ) భాగస్వామ్యంతో 10వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐదేళ్లలో ఇక్కడ రూ.70 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఏయూఆర్‌ఐసీ జాయింట్‌ ఎండీ గజానన్‌ పాటిల్‌ బుధవారమిక్కడ రోడ్‌ షో సందర్భంగా విలేకరులతో చెప్పారు. తొలి దశలో కొరియా, స్వీడన్, జర్మనీ దేశాలకు చెందిన పలు ఇంజనీరింగ్‌ కంపెనీలకు 5,07,164 లక్షల చ.మీ. (52 ప్లాట్లు) స్థలాన్ని కేటాయించామని, వీటి ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పాటిల్‌ తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన హోయ్‌సంగ్‌ కార్పొరేషన్‌ రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, జూన్‌లో ప్లాంట్‌లో ఉత్ప త్తుల తయారీ ప్రారంభమవుతుందని తెలియజేశారు. 

హైదరాబాద్‌ నుంచి ఐటీ కంపెనీలు.. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఐటీ, ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, వీటితో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్‌లో అపార అవకాశాలున్నాయని పాటిల్‌ తెలి యజేశారు. ఏయూఆర్‌ఐసీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం రూ.7947 కోట్ల నిధులను కేటా యించిందని, 60 శాతం స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు, 40 శాతం స్థలాన్ని నివాస, వాణిజ్య, సామా జిక అవసరాలకు కేటాయించమని చెప్పారు. చ.మీ. కు ధర రూ.3200గా నిర్ణయించామని తెలియ జేశారు. ఆన్‌లైన్‌ ద్వారా సింగిల్‌ విండోలో 10 రోజుల్లో అనుమతులను జారీ చేస్తున్నామన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement