ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్


తైవాన్  ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఆసుస్, జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ను విడుదల చేసింది. రెండు మెమెరీ ఆప్షన్లు, ఇన్ బిల్డ్ స్టోరేజ్ పెంచుకునేలా, ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615ఎస్ఓసీ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 2జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999గా, 3జీబీ ర్యామ్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను ఈ వేరియంట్లు కలిగిఉన్నాయి. ఈ కొత్త జెన్ ఫోన్ మ్యాక్స్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలోతో పనిచేయనున్నాయి. రెండు కలర్లు బ్లూ, ఆరెంజ్ ల్లో ఈ ఫోన్లు లభ్యంకానున్నాయని, 2జీబీ ర్యామ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్ వేరియంట్ త్వరలోనే అమ్మకానికి వస్తుందన్నారు.


క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 401ఎస్ఓసీతో జెన్ ఫోన్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను మొదట జనవరిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పట్లో 16జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ధరను రూ.8,999కి తగ్గించి కంపెనీ ఇప్పటికీ ఒరిజినల్ జెన్ ఫోన్ మ్యాక్స్ ను ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడుతోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ హ్యాండ్ సెట్ నుంచి బ్యాటరీని బయటికి తీయలేం. 5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ టీఈటీ డిస్ ప్లే, 64జీబీ వరకూ విస్తరణ మెమెరీ, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాస్ తో 13ఎంపీ రేర్ కెమెరా,5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్, లేజర్ ఆటోఫోకస్ పీచర్ ఈ ఫోన్ లో ఇతర ప్రత్యేకతలు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top