ఆర్సెలర్‌ మిట్టల్‌ చేతికి ఎస్సార్‌ స్టీల్‌!

ArcelorMittal wins bids to take over Essar Steel for Rs 42,000 crore - Sakshi

సాక్షి, ముంబై: రుణ భారంతో కుదేలైన ఎస్సార్‌ స్టీల్‌ ను ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిట్టల్‌  ఎట్టకేలకు  సొంతం చేసుకుంది.  లక్ష్మీ మిట్టల్‌ యాజమాన్యంలోని ఆర్సెలార్‌ మిట్టల్‌ ఈ స్టీల్స్ ను రూ.42,000కోట్లకు దక్కించుకున్నారు.  ఆర్సెలర్‌ మిట్టల్‌, భాగస్వామి జపాన్‌ నిస్సాన్‌ స్టీల్‌   అండ్‌  సుమిటోమోకు  కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ (బ్యాంకుల రుణదాతల కమిటీ ) లెటర్ ఆఫ్ ఇంటెంట్   జారీ చేసింది.

ఈ మేరకు కంపెనీ శుక్రవారం  ఒక ప్రకటన జారీ చేసింది. రూ.49వేల కోట్ల  బకాయిలను తాము  చెల్లించాల్సి ఉందని మిట్టల్‌ తెలిపారు. ముందుగా అప్పులను తీర్చుందుకు 42వేల కోట్లను, మరో ఎనిమిదివేల కోట్ల రూపాయల నిర్వాహక పెట్టుబడులను  సంస్థకు సమకూర్చనుంది. ఎస్సార్ స్టీల్‌ను దివాలానుంచి బయటపడేందుకు గాను రుణదాతలకు రూ. 54,389 కోట్లు,  47,507 కోట్ల రూపాయల నగదు చెల్లింపులకు ఆర్సెలర్‌ అంగీకరించిన తర్వాత రోజు ఈ అభివృద్ధి జరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top