
మాజీ ఉద్యోగినుల కోసం అమెజాన్ రీకిండిల్
వివిధ కారణాలతో కొన్నాళ్ల పాటు కెరియర్ నుంచి విరామం తీసుకున్న మహిళా ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాల్లోకి చేరడంలో తోడ్పాటు అందించేందుకు...
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో కొన్నాళ్ల పాటు కెరియర్ నుంచి విరామం తీసుకున్న మహిళా ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాల్లోకి చేరడంలో తోడ్పాటు అందించేందుకు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ’రీకిండిల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగ విధుల్లో వెసులుబాటు, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణ మొదలైన సదుపాయాలు కల్పించనుంది.
ఇటు టెక్నాలజీ, ఆపరేషన్స్ కార్యకలాపాలతో పాటు అటు మానవ వనరుల నిర్వహణ తదితర కార్యకలాపాల్లోనూ పాలుపంచుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. మళ్లీ ఆయా ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇవన్నీ తోడ్పడతాయని అమెజాన్ డైరెక్టర్ రాజ్ రాఘవన్ తెలిపారు.