
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థలు పండుగల సీజన్‌లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల అమ్మకాల కోసం 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది. మరో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్‌లో తాత్కాలికంగా 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో వీరి అవసరం ఉందని తెలిపింది.