ఎయిర్‌టెల్ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్ | Airtel launches microsite for 'Project Leap' | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్

Dec 29 2015 4:53 AM | Updated on Sep 3 2017 2:42 PM

ఎయిర్‌టెల్ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్

ఎయిర్‌టెల్ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్

భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది.

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కవరేజ్ లైవ్ స్టేటస్‌ను ఈ ప్రత్యేకమైన వెబ్‌సైట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ కంపెనీ సైట్ విస్తరణ ప్రాజెక్ట్ పురోగతిని కూడా వెల్లడిస్తుంది. కాల్ డ్రాప్‌ల విషయంలో విమర్శలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తుండడం విశేషం. మొబైల్ నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరిచేందుకు గానూ మూడేళ్లలో రూ.60,000 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్ లీప్‌ను అమలుచేయబోతున్నట్లు గత నెలలోనే ఎయిర్‌టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement