ఎయిర్‌ ఏసియా డిస్కౌంట్‌ సేల్‌ | AirAsia India's New Offer: Avail 20percent Discount On Flight Tickets | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఏసియా డిస్కౌంట్‌ సేల్‌

Feb 19 2018 12:38 PM | Updated on Feb 19 2018 12:45 PM

AirAsia India's New Offer: Avail 20percent Discount On Flight Tickets - Sakshi

సాక్షి, ముంబై: విమానయాన సం‍స్థ ఎయిర్‌ ఏసియా  విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్‌ ధరలను   ప్రారంబించింది. స్పెషల్‌ ప్రమోషన్‌ పథకం కింద ఎయిర్‌ ఏసియా ఇండియా  దేశీయ విమాన టిక్కెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.  అలాగే పేరెంట్‌ కంపెనీ ఏయిర్‌ ఏసియా కూడా అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బేస్ ఛార్జీలపై 20శాతం రాయితీ ఆఫర్‌ చేస్తోంది.  ఈ డిస్కౌంట్ ఆఫర్‌లో టికెట్ల  బుకింగ్‌ సదుపాయం  ఫిబ్రవరి 25తో ముగియనుంది.   దీంతోపాటు  మొబిక్విక్‌ ద్వారా చేసిన కొనుగోళ్లపై మరో 15శాతం తగ్గింపును ఆఫర్‌  చేస్తోంది.

బెంగళూరు, న్యూ ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం  తదితర దేశీయ మార్గాల్లో టికెట్లకు ఈ  రేట్లు డిస్కౌంట్లను అంది‍స్తోంది.  అంతర్జాతీయ మార్గాల్లో, వైమానిక సంస్థ విమానాలు కౌలాలంపూర్, ఆక్లాండ్, బ్యాంకాక్ తదితర  అనేక విమానాల టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని  సంస్థ అధికారిక వెబ్సైట్ airasia.com లో తెలిపింది. ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ కాలం 2018 ఫిబ్రవరి 25నుంచి ప్రారంభమై 28తో ముగుస్తుంది.   విదేశీ మార్గాల్లో   అయితే మార్చి 25న మొదలై జూలై 31, 2018 తో  ముగుస్తుంది. అయితే కొన్ని  విదేశీ మార్గాల్లో ప్రయాణ కాలానికి సంబంధించిన వివరాలో అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement