ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం

Air India refuses tickets to govt agencies that owe more than Rs 10 lakh to debt-ridden airline - Sakshi

సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థలకు షాకిచ్చింది. తమకు భారీగా బకాయి పడ్డ సంస్థలకు ఇకపై అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ. 10లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు  టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్‌ స్టమ్స్ కమిషనర్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిరిండియా టికెట్లు కొనుగోలు ద్వారా  వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఎయిరిండియాకు రావాల్సిన  మొత్తం బకాయిల విలువ రూ .268 కోట్లు.

గత నెలలోఎయిరిండియా ఆర్థిక విభాగం ప్రభుత్వ  సంస్థల బకాయిలపై ఒక డేటాను రూపొందించింది. ఈ నేపథ్యంలో రూ .10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారిని 'క్యాష్ అండ్ క్యారీ' (నగదు చెల్లించినవారికి మాత్రమే) ద్వారా టికెట్లు జారీ చేయాని నిర్ణయించామని అని ఎయిరిండియా అధికారి ఒకరు వివరించారు. అయితే, లోక్‌సభ సహా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  కొన్ని మినహాయింపులు ఇచ్చామన్నారు. ఈక్ర మంలో గత కొన్నివారాల్లో సుమారు రూ. 50 కోట్లను రికవరీ చేశామని తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ రూ .5.4 కోట్లు, సీబీఐ రూ.95లక్షలు ఈడీ రూ.12.8 లక్షల, లోక్‌సభ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఎస్‌ఏకు రూ .2.2 కోట్లు మేర ఎయిరిండియాకు బాకీ పడ్డాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top