రుచి సోయా రేసులో టాప్‌ బిడ్డర్‌గా అదానీ

రూ.6,000 కోట్లతో అత్యధిక బిడ్‌...

న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న వంట నూనెల కంపెనీ రుచి సోయాను దక్కించుకునే రేసులో అదానీ గ్రూప్‌ టాప్‌ బిడ్డర్‌గా నిలిచిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.6,000 కోట్లకు బిడ్‌ వేసిన అదానీ విల్‌మర్‌ అత్యధిక బిడ్‌ వేసిన కంపెనీగా నిలిచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

రుచి సోయాను దక్కించుకోవడానికి పోటీ పడిన  మరో కంపెనీ పతంజలి గ్రూప్‌ రూ.5,700 కోట్లకు బిడ్‌ను దాఖలు చేసింది. అయితే స్విస్‌ చాలెంజ్‌ పద్థతిలో పతంజలి గ్రూప్‌కు తన ఆఫర్‌ను మరింతగా పెంచే హక్కు ఉంటుంది. రుచి సోయా రుణ దాతల కమిటీ మంగళవారం బిడ్‌లను ఓపెన్‌ చేసింది. రుచి సోయా మొత్తం రూ.12,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top