హైదరాబాద్‌లో అడామా ఫార్ములేషన్ ల్యాబ్!
సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న అడామా హైదరాబాద్‌లోని ఐకేపీ నాలెడ్జ్‌పార్క్‌లో కొత్తగా ఫార్ములేషన్ ల్యాబ్‌ను ప్రారంభించింది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న అడామా హైదరాబాద్‌లోని ఐకేపీ నాలెడ్జ్‌పార్క్‌లో కొత్తగా ఫార్ములేషన్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఇక్కడ 10 వేల చ.అ.ల్లో సైంథటిక్ ల్యాబ్, అనాలిటికల్ ల్యాబ్, స్పేలప్ ల్యాబొరేటరీ అనే మూడు విభాగాలున్నాయని.. కొత్తగా ఆర్‌అండ్‌డీ ఫార్ములేషన్ ల్యాబ్‌ను ప్రారంభించామని అడామా ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ లెవానాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్‌కు, రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే వీలుంటుందని.. ప్రస్తుతం దేశంలో 70కి పైగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. అడామా కేంద్ర కార్యాలయమైన ఇజ్రాయిల్ తర్వాత రెండో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఉంది.


