ఐకేఎంసీ సదస్సులో స్టార్టప్స్‌ సందడి | IKP Knowledge Park will host the 19th International Knowledge Millennium Conference 2025 | Sakshi
Sakshi News home page

ఐకేఎంసీ సదస్సులో స్టార్టప్స్‌ సందడి

Oct 28 2025 6:22 AM | Updated on Oct 28 2025 6:22 AM

 IKP Knowledge Park will host the 19th International Knowledge Millennium Conference 2025

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ (ఐకేపీ) తలపెట్టిన 19వ విడత ఇంటర్నేషనల్‌ నాలెడ్జ్‌ మిలీనియం కాన్ఫరెన్స్‌ (ఐకేఎంసీ) 2025లో 150కి పైగా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చేలా ఐకేపీ పలు కీలక ప్రకటనలు చేసింది. 

ఐకేపీ ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ ఫండ్‌ ద్వారా ప్రోజెన్‌ ఫుడ్స్‌ స్టార్టప్‌లో రూ. 1 కోటి వరకు ఇన్వెస్ట్‌మెంట్, ఐకేపీ ఫ్యూచర్‌ స్టార్స్‌ అవార్డ్స్‌ కింద అయిదు యువ ఆవిష్కర్తలకు రూ. 5 లక్షల చొప్పున గ్రాంట్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో భాగమైన స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ (స్పీడ్‌) అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ప్రత్యేక చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సహ–వ్యవస్థాపకుడు విజయ్‌ చంద్రుతో పాటు పలువురు టెక్నాలజీ ఆవిష్కర్తలు, ఎంట్రప్రెన్యూర్లు ఇందులో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement