breaking news
IKP Knowledge Park
-
ఐకేఎంసీ సదస్సులో స్టార్టప్స్ సందడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఐకేపీ) తలపెట్టిన 19వ విడత ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మిలీనియం కాన్ఫరెన్స్ (ఐకేఎంసీ) 2025లో 150కి పైగా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చేలా ఐకేపీ పలు కీలక ప్రకటనలు చేసింది. ఐకేపీ ఫ్యూచర్ ఫార్వర్డ్ ఫండ్ ద్వారా ప్రోజెన్ ఫుడ్స్ స్టార్టప్‌లో రూ. 1 కోటి వరకు ఇన్వెస్ట్మెంట్, ఐకేపీ ఫ్యూచర్ స్టార్స్ అవార్డ్స్ కింద అయిదు యువ ఆవిష్కర్తలకు రూ. 5 లక్షల చొప్పున గ్రాంట్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో భాగమైన స్పెషల్ ప్రాజెక్ట్స్ (స్పీడ్) అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సహ–వ్యవస్థాపకుడు విజయ్ చంద్రుతో పాటు పలువురు టెక్నాలజీ ఆవిష్కర్తలు, ఎంట్రప్రెన్యూర్లు ఇందులో పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అడామా ఫార్ములేషన్ ల్యాబ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న అడామా హైదరాబాద్‌లోని ఐకేపీ నాలెడ్జ్పార్క్లో కొత్తగా ఫార్ములేషన్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఇక్కడ 10 వేల చ.అ.ల్లో సైంథటిక్ ల్యాబ్, అనాలిటికల్ ల్యాబ్, స్పేలప్ ల్యాబొరేటరీ అనే మూడు విభాగాలున్నాయని.. కొత్తగా ఆర్అండ్డీ ఫార్ములేషన్ ల్యాబ్‌ను ప్రారంభించామని అడామా ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ లెవానాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్‌కు, రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే వీలుంటుందని.. ప్రస్తుతం దేశంలో 70కి పైగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. అడామా కేంద్ర కార్యాలయమైన ఇజ్రాయిల్ తర్వాత రెండో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఉంది.


