యాక్సెంచర్లో 95వేల కొత్త ఉద్యోగాలు | Accenture shoots past TCS in headcount; says 95000 people will join in 2015 | Sakshi
Sakshi News home page

యాక్సెంచర్లో 95వేల కొత్త ఉద్యోగాలు

Jun 27 2015 9:02 AM | Updated on Sep 3 2017 4:28 AM

యాక్సెంచర్లో 95వేల కొత్త ఉద్యోగాలు

యాక్సెంచర్లో 95వేల కొత్త ఉద్యోగాలు

ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది.

న్యూయార్క్ : ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. కంపెనీ సెప్టెంబర్-ఆగస్టు కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించగా, నాలుగో త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది.

మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,36,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్తోనే ఉన్నారు. మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో అత్యధికంగా 3,19,656 మంది, ఇన్ఫోసిస్లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement