
అయ్యో.. రొయ్య...!
విదేశీ గడ్డపై మన రాష్ట్ర రొయ్యలకు ఎదురుదెబ్బ తగిలింది.
భీమవరం: విదేశీ గడ్డపై మన రాష్ట్ర రొయ్యలకు ఎదురుదెబ్బ తగిలింది. యూంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నాయన్న కారణంగా గడచిన 20 రోజులుగా యూరోపియన్ దేశాల నుంచి రొయ్యల కంటైనర్లు వెనక్కి వచ్చేస్తున్నారుు. ఇప్పటివరకు సుమారు 45 కంటైనర్లు వెనక్కి వచ్చేసినట్టు ఎగుమతిదారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
తిరిగొచ్చిన కంటైనర్లలోని రొయ్యల విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రొయ్యల ఎగుమతిదారులకు రూ.67 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. 2006లోనూ యూంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నాయన్న కారణంగా ఈ ప్రాంత రొయ్యల్ని ఆయూ దేశాలు వెనక్కి పంపించారుు. ఆ తరువాత రొయ్యల పెంపకంలో రైతులు, ప్రాసెసింగ్ విషయంలో ఎగుమతిదారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిదేళ్ల అనంతరం తిరిగి అదే పరిస్థితులు తలెత్తడంతో ఏం చేయూలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.
తగ్గిన ఎగుమతులు
రొయ్యల కంటైనర్లు వెనక్కి తిరిగి రావడంతో కోస్తా జిల్లాల నుంచి ఎగుమతులు మందగించారుు. రైతుల నుంచి రొయ్యల్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన రొయ్యల్ని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేస్తున్నారు.