breaking news
Shrimp containers
-
2000 కంటైనర్లలో రొయ్యలు.. ఎక్కడకు వెళ్తున్నాయంటే..
అమెరికాకు రొయ్యలు సరఫరా చేసేందుకు భారత సీఫుడ్ ఎగుమతిదారులు సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు బ్రేక్ పడడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేస్తున్నట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించినట్లయింది. దాంతో సుమారు రెండు వేల కంటైనర్ల రొయ్యలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను కొంతకాలంపాటు నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న 10 శాతాన్ని అమలు చేస్తుండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భారత సీఫుడ్ ఎగుమతిదారులు 35,000-40,000 టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశ్రమ అధికారులు సోమవారం తెలిపారు. సుంకాల భయాలతో నిలిపివేసిన ఎగుమతులను ప్రాసెస్ చేస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. సుమారు 2,000 కంటైనర్ల రొయ్యలు ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: సుంకాల యుద్ధంలో విజేతలుండరుఅమెరికా దాటికి 145 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న చైనా మినహా అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. దాంతో భారత్‌పై 10 శాతం సుంకాలు అమలవుతుండడంతో ప్రస్తుతం ఎగమతులు ఊపందుకున్నాయి. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.7 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 1.8 శాతంగా ఉంది. పరిమాణం, విలువ రెండింటిలోనూ యూఎస్‌కు భారతదేశం అతిపెద్ద రొయ్యల మార్కెట్‌గా ఉంది. సుంకాల భయాలున్నా ఆర్డర్లు తగ్గలేదని అసోసియేషన్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసింది. -
అయ్యో.. రొయ్య...!
భీమవరం: విదేశీ గడ్డపై మన రాష్ట్ర రొయ్యలకు ఎదురుదెబ్బ తగిలింది. యూంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నాయన్న కారణంగా గడచిన 20 రోజులుగా యూరోపియన్ దేశాల నుంచి రొయ్యల కంటైనర్లు వెనక్కి వచ్చేస్తున్నారుు. ఇప్పటివరకు సుమారు 45 కంటైనర్లు వెనక్కి వచ్చేసినట్టు ఎగుమతిదారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తిరిగొచ్చిన కంటైనర్లలోని రొయ్యల విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రొయ్యల ఎగుమతిదారులకు రూ.67 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. 2006లోనూ యూంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నాయన్న కారణంగా ఈ ప్రాంత రొయ్యల్ని ఆయూ దేశాలు వెనక్కి పంపించారుు. ఆ తరువాత రొయ్యల పెంపకంలో రైతులు, ప్రాసెసింగ్ విషయంలో ఎగుమతిదారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిదేళ్ల అనంతరం తిరిగి అదే పరిస్థితులు తలెత్తడంతో ఏం చేయూలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. తగ్గిన ఎగుమతులు రొయ్యల కంటైనర్లు వెనక్కి తిరిగి రావడంతో కోస్తా జిల్లాల నుంచి ఎగుమతులు మందగించారుు. రైతుల నుంచి రొయ్యల్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన రొయ్యల్ని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేస్తున్నారు.