డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ? | 30 percent green tax on diesel vehicles? | Sakshi
Sakshi News home page

డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ?

Apr 20 2016 12:35 PM | Updated on Sep 28 2018 3:18 PM

డీజిల్ వాహనాలపై  30 శాతం గ్రీన్ టాక్స్ ? - Sakshi

డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ?

డీజిల్ ఉద్గారాలను మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై విధించేలా పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఎ) అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుముందు ఉంచనుంది.


న్యూఢిల్లీ:  డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.  డీజిల్  ఉద్గారాలు మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై  పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఎ) అప్రమత్తమైంది.  ఈ క్రమంలో  డీజిల్ వాహనాలపై 30 శాతం  గ్రీన్ టాక్స్  విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుముందు ఉంచనుంది. డీజిల్ వాహనాలను నియంత్రించే లక్ష్యంతో  సుప్రీం కోర్టు లో  ఏప్రిల్ 30 న ఒక రోజంతా  విచారణ సాగనుంది.  ఈ నేపథ్యంలోనే ఈపీసీఎ  ఈ తాజా ప్రతిపాదను చేయనున్నట్టు సమాచారం.  

సెంటర్ ఫర్  సైన్స్అండ్ ఎన్వైరాన్ మెంట్ సెంటర్ ( సీఎస్ సీ)  మంగళవారం డీజిల్ ఉద్గార సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ సూచన చేసింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్  క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతినిధి  రే మింజారేస్ 'డీజిల్ ఉద్గారాలు- తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు' అనే అంశంపై  ప్రసంగించారు. ఈ  సందర్భంగా డీజల్ యొక్క ఆరోగ్య ప్రభావాలపై  కెనడా ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక సహా మూడు నివేదికలను వివరించారు.  డీజల్  కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ  సమస్యలు,  హృద్రోగ సమ్యలతో పాటుగా  రోగనిరోధక  వ్యవస్థపై ప్రభావం  చూపిస్తుందని నివేదించారు. ఈ సమస్యపై కెనడా, అమెరికా ప్రభుత్వాలు  ఇప్పటికే అప్రమత్తమయ్యాని తెలిపారు.  ఈ రిపోర్టును సుప్రీం ముందుంచాలని  ఆయన సూచించారు.
 
మార్చి 2016లో భారత ఆటోమోటివ్  రిసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన   పరీక్షల్లో   దాదాపు లక్షన్నర డీజిల్ కార్లు  అత్యధిక   కార్బన్ ఉద్గారాలను కలిగివున్నట్టు  తేలిందని ఐసిసీటీ మరో అధికారి ఫాంటా తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న  విధానాన్ని  సమీక్షించాలని, ఉద్గార ప్రమాణాలపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.

కాగా పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు  2016-17 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో   ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1 శాతం, డీజిల్ కార్లపై 2.5 శాతం, విలాసవంతమైన కార్లు, ఎస్‌యూవీలపై 4 శాతం పన్ను,పదిలక్షల విలువదాటిన కార్లపై1 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.  మరి ఈపీసీఎ సూచనలపై సుప్రీం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement