21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్ | 30,000 Coolpad Note 3 Lite devices sold in 21 seconds | Sakshi
Sakshi News home page

21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్

Jan 28 2016 7:48 PM | Updated on Sep 3 2017 4:29 PM

21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్

21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్

ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెకన్లలో వేల ఫోన్లు అమ్ముడుపోతున్నాయి.

న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెకన్లలో వేల ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ విక్రయానికి పెట్టిన నోట్ 3 లైట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని కూల్ ప్యాడ్ తెలిపింది.

'ఫస్ట్ ఫ్లాస్ సేల్ లో కూల్ ప్యాడ్ నోట్ 3కి అద్భుత స్పందన లభించింది. 21 సెకన్లలో 30 వేల ఫోన్లు విక్రయించాం. టెక్నాలజీ అందరికీ చేరువ చేయాలన్న మా ప్రయత్నానికి మద్దతు లభించింద'ని కూల్ ప్యాడ్ ఇండియా సీఈవో సయిద్ తజూద్దీన్ అన్నారు. ఫిబ్రవరి 4న మరోసారి ఫ్లాస్ సేల్ పెడతామని తెలిపారు. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999, 360 డిగ్రీల పింగర్ రోటేషన్, 4జీ ఎల్ టీఈను సపోర్ట్ చేస్తుంది.

కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు
3 జీబీ ర్యామ్
5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే
16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ
13 ఎంపీ కెమెరా
2,500 ఏఎంపీ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement