రెండిళ్లలో చోరీ  | two houses were robbed in bhadradri district | Sakshi
Sakshi News home page

రెండిళ్లలో చోరీ 

Feb 2 2018 6:28 PM | Updated on Aug 30 2018 5:27 PM

two houses were robbed in bhadradri district - Sakshi

చోరీ దృశ్యం

కారేపల్లి : కారేపల్లిలోని రెండు ఇళ్లలో గురువారం చోరీ జరిగింది. సమ్మక్క సరక్క జాతరకు కుటుంబసమేతంగా వెళ్లిన ఇళ్ల తాళాలను దొంగలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మేదర బజార్‌కు చెందిన చింతల రాంబాబు కుటుంబం, అంబేడ్కర్‌ సెంటర్‌ మెయిన్‌ రోడ్‌లోని ముద్ద నూరి లక్ష్మీనారాయణ కుటుంబం కలిసి మేడారం జాతరకు మంగళవారం వెళ్లారు. జాతర వెళ్లిన సంగతి తెలుసుకున్న దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళాలను పగలగొట్టారు. బీరువాలను గడ్డపార, పట్టుకారులతో పగలగొట్టారు. రాంబాబు ఇంట్లో వెండి పట్టీలు, గ్లాసులు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. లక్ష్మీనారాయణ ఇంట్లో నుంచి విలువైన సామానుతోపాటు కొంత నగదు చోరీ చేశారు. రాంబాబు ఇంటి తలుపు తాళాలు తీసి ఉండడం, లోపలికి కోతులు వెళుతుండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. చోరీ జరిగినట్టుగా గమనించి ఇంటి యజమానికి ఫోన్‌లో సమాచారమిచ్చారు. రాంబాబు, లక్ష్మీనారాయణ, వారి కుటుంబీకులు తిరిగొచ్చారు. లక్ష్మీనారాయణ ఇంట్లో కూడా చోరీ జరిగిన విషయం.. వారు వచ్చిన తర్వాతనే బయటపడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement