గ్రహం అనుగ్రహం(18-08-2018)

Daily Rasiphalalu in Telugu(18-08-2018) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరందక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి, బ.తదియ రా.10.08 వరకు తదుపరి, చవితి, నక్షత్రం పూర్వాభాద్ర ప.3.21 వరకు, తదుపరి ఉత్తరాభాద్రవర్జ్యం రా.1.54 నుంచి 3.41 వరకు దుర్ముహూర్తం సా.4.41 నుంచి 5.32 వరకు, అమృతఘడియలు.. ఉ.6.28 నుంచి 8.03 వరకు.

సూర్యోదయం        :  5.46
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం:ఖ్యాతి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు.

వృషభం:పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మిథునం:పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు సామాన్యం ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం:సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం.

సింహం:చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య:రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.మిత్రుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

తుల:పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ప్రయాణాలలో మార్పులు. ఆ«ధ్యాత్మిక చింతన. అనారోగ్యం. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం:అనుకున్న పనులలో ఆటంకాలు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు:కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం:కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం:శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం:సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top