గ్రహం అనుగ్రహం (13-01-2020) | Daily Rasi Phalalu in Telugu (13-01-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (13-01-2020)

Jan 13 2020 6:02 AM | Updated on Jan 13 2020 6:02 AM

Daily Rasi Phalalu in Telugu (13-01-2020) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. పుష్యమాసం. తిథి బ.తదియ రా.8.27 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష ప.12.49 వరకు, తదుపరి మఖ. వర్జ్యం రా.12.09 నుంచి 1.37 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.15 వరకు, తదుపరి ప.2.41 నుంచి 3.25 వరకు. అమృత ఘడియలు ఉ.11.20 నుంచి 12.43 వరకు.

సూర్యోదయం: 6.38 సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

వృషభం: కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగే సమయం.

కన్య: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలబ్ధి. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

దనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

మకరం: ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

కుంభం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: సన్నిహితులతో వివాదాలు.  కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. బంధువులతో చర్చలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement