'మేదరమెట్లలో టీటీటీ కళ్యాణమంటపం ఏర్పాటు చేస్తాం'

YV Subba Reddy Sankranthi Celebrations In Medarametla - Sakshi

సాక్షి, ప్రకాశం : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన స్వగ్రామమైన మేదరమెట్లలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  తన ఇంటివద్ద భోగిమంటలు వేసి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్‌ దయాల్‌ శ్రవణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 400 మందికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి సంబంధించిన శస్త్ర చికిత్సలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తుచేశారు. సంక్రాంతికి ప్రతి ఏటా స్వగ్రామంలో గడపటం ఆనందానిస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మేదరమెట్లలో టీటీడీ కళ్యాణమంటపం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top