పదో రోజుకు రిలే దీక్షలు

YSRCP Tuni Cadres Tenth Day Relay Fastings For AP Special Status - Sakshi

పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ బొద్దవరం, దానవాయిపేట, ఎ.కొత్తపల్లి నేతలు

పలువురి మద్దతు

తుని : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దాడిశెట్టి ఆధ్వర్యంలో స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం పదో రోజుకు చేరాయి. కోటనందూరు మండలం బొద్దవరం, తొండంగి మండలం దానవాయిపేట, ఎ.కొత్తపల్లి పంచాయతీల పరిధిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి పార్టీ తుని పట్టణ శాఖ అ«ధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్‌ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు.

రిలే దీక్షలో బొద్దవరానికి చెందిన దొడ్డి బాబ్జీ, సుర్ల నానాజీ, వేగి అప్పలనాయుడు, సుర్ల అప్పలనాయుడు, యల్లపు దొరబాబు, లగుడు వరహాలు, యల్లపు రామసూరి, మళ్ల శ్రీను, యల్లపు రాము, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మేరుగు ఆనందహరి, యనమల నాగేశ్వరరావు, గరికిన రాజు, మొసా సత్తిబాబు, అంగుళూరి శ్రీను, మడదా శ్రీనివాసరావు, మారేటి లక్ష్మణరావు, కుక్కా నాగరాజు, పిరాది గోపి, పి.పోలారావు, నేమాల రామకృష్ణ, అంబుజాలపు అచ్చారావు, ఎ.కొత్తపల్లికి చెందిన వనపిర్త సూర్యనారాయణ, సాపిశెట్టి చిన్న, వడ్లమూరి కృష్ణ, బెక్కం చంద్రగిరి, గర్లంక బాబ్జీ, డి.నాగు, మెయ్యేటి సత్యానందం, వనపర్తి రాఘవ, శివకోటి శేషారావు, గణ్ణియ్య, వెలుగుల చిట్టిబాబు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. అందరూ సమష్టిగా పోరాటం చేయకపోతే భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏకతాటిపై పోరాటం చేస్తే ఢిల్లీ పెద్దలు దిగివస్తారని నాయకులు స్పష్టం చేశారు. పదో రోజు దీక్ష చేస్తున్న వారికి పార్టీ నాయకులు షేక్‌ ఖ్వాజా, అనిశెట్టి నాగిరెడ్డి, కీర్తి రాఘవ, కుసనం దొరబాబు, నాగం గంగబాబు, గాబు రాజబాబు, బర్రే అప్పారావు, చోడిశెట్టి పెద్ద, వాసంశెట్టి శ్రీను, షేక్‌ బాబ్జి, కొప్పన రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top