ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ప్రకటించేటప్పుడు వాటిలో ఎస్సీ, ఎస్టీ ఖాళీల వివరాలు ప్రకటించడంలేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ప్రకటించేటప్పుడు వాటిలో ఎస్సీ, ఎస్టీ ఖాళీల వివరాలు ప్రకటించడంలేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయన్న తమ ప్రశ్నకు సమాధానంగా.. 4,300 పోస్టులు ఉన్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల వివరాలు, ఖాళీల వివరాలు సేకరించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కమలనాథన్ కమిటీని వేసిందని, రాష్ట్రస్థాయి, సెక్రటేరియట్ స్థాయిలో 20,630 ఖాళీలున్నట్లు ఆ కమిటీ చెప్పిందని ఆయన అన్నారు.
కానీ, ఈ ఖాళీల వివరాలు ప్రకటించేటప్పుడు వాటిలో ఎస్సీ, ఎస్టీ పోస్టుల వివరాలను గుర్తించలేదన్నారు. మొత్తం ఖాళీలలో 15 వేలకు పైగా పోస్టులు ఎస్సీ, ఎస్టీలవేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, ఈ విషయంలో నిరుద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మంత్రి దీనిపై శ్రద్ధపెట్టి, వారి ఖాళీలు వారికే దక్కేలా చూడాలని కోరారు. రికార్డులు పరిశీలించి దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి రావెల కిషోర్బాబు దానికి సమాధానమిచ్చారు.