అగ్రి బాధితులకు అండ

YSRCP Protest Over Agri Gold Issue - Sakshi

పిల్లల చదువులకు పనికొస్తుందని ఒకరు... మలిసంధ్యలో తోడ్పడుతుందని మరొకరు... కుమార్తె వివాహం కోసం ఇంకొకరు... ఇలా ఎవరికి వారే నమ్మకంగా కనిపించిన ఏజెంట్ల ప్రోద్బలంతో అగ్రిగోల్డ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పాపం ఏజెంట్లూ ఆ సంస్థను గుడ్డిగా నమ్మేశారు. పదిమందితో పెట్టుబడి పెట్టించడమే గాదు.. తామూ అందులో మదుపుపెట్టి ఇప్పుడు నిండా మునిగి పోయారు. వందలు... వేలు కాదు... లక్షల్లో ఇప్పుడు బాధితులు ప్రతి చోటా కనిపిస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దొంగనాటకాలాడుతోంది. ఇప్పుడు బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని వారికి భరోసా కల్పిస్తోంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాల సాక్షిగా మరొక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా బాధితులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం రిలేనిరాహార దీక్ష ప్రారంభించింది. ప్రజల పక్షాన ప్రతిపక్షం చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా క ల్పించేందుకు ఏర్పాటైన కమిటీకి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న మజ్జిశ్రీనివాసరావు, జిల్లాలోని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజన్నదొర, ఇతర నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.

  • ∙విజయనగరంలో పార్టీ నగర కన్వీనర్‌ ఆశపు వేణు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.వి.రంగారావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌వద్ద చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షలను పార్టీ ని యోజకవర్గ బూత్‌ కన్వీనర్ల ఇన్‌చార్జి ఎస్‌.వి. వి.రాజేష్, రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన దీక్షలను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విరమింపజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివా సరావు, జిల్లా ఎస్సీసెల్‌ కన్వీనర్‌ పీరుబండి జైహింద్‌కుమార్‌ పాల్గొన్నారు.
  • ∙సాలూరు పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మద్దతు పలికారు. పార్టీ  నాయకుడు జరజాపు ఈశ్వరరా వు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ముగడ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. 
  • ∙కురుపాంలోని రావాడ రోడ్డు జంక్షన్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల రిలే నిరాహారదీక్షలను అర కు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం మండలాల నాయకులు, అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు పాల్గొన్నారు. 
  • ∙చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నాలుగు మండలాల్లో జరిగిన శిబిరాలను  జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్త, అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగ రం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు  బెల్లాన చం ద్రశేఖర్‌ ప్రారంభించి సంఘీభావం తెలిపారు.
  • ∙పూసపాటిరేగ, డెంకాడ మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సురేష్‌ బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, తదితరులు మద్దతు తెలిపారు. శిబిరాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు.  పూసపాటిరేగ, డెంకాడ మండలాల పార్టీ అధ్యక్షులు  పతి వాడ అప్పలనాయుడు, బంటుపల్లి వాసుదేవరావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. 
  • ∙గజపతినగరం మూడు రోడ్లు జంక్షన్‌లో చేపట్టిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్స య్య, మాజీ జెడ్పీటీసీ గార తౌడు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి, తెర్లాం, రామభద్రపురం, బొబ్బిలి మండలాల తహసిల్దార్‌ కార్యాలయాల ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ  నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
  • ∙ఎస్‌.కోట దేవీ జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ రహమాన్‌ నేతృత్వంలో ఏర్పాటైన శిబిరాన్ని ఎస్‌.కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీజిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్వతీపురం పట్టణంలో శనివారం పార్టీ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆ«ధ్వర్యంలో స్థానిక కోర్టు సముదాయంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వం బాధ్యతారాహిత్యం 
ఏళ్ల తరబడి తమ బకా యిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోం ది. బాబు పాలనలో ఏ వర్గమూ సుఖశాంతులతో ఉండడం లేదు. అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలోనే ప్ర భుత్వం బాధితులకు అన్యాయం చేస్తోంది. 
– కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ

ఆదుకోని ప్రభుత్వం అవసరమా..?
కడుపు మాడ్చుకుని పిల్లల అవసరాలకోసం పేదలు దాచుకున్న సొమ్మును అ గ్రిగోల్డ్‌ సంస్థ స్వాహాచేస్తే, ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇలాంటి ప్రభుత్వం అవసరమా ?. ఒత్తిడిని తట్టుకోలే క ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడం లేదు. పైగా మరణించిన వారి ప్రాణాలకు ఖరీదు కడుతోంది. రాష్ట్రంలో 20లక్షల మం ది బాదితుల్లో ఎక్కువమంది పేదలే. వారికి న్యాయం చేయకుంటే తగిన శాస్తి తప్పదు.
– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top