ప్రతి ఎమ్మెల్యేకీ నిధులిస్తున్నారా?

YSRCP MLA Rachamallu Sivaprasad Reddy Fires On TDP - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్న మరుసటి రోజే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. టీడీపీ గొప్పలు చెప్పుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నిస్తే మైక్‌కట్‌ చేస్తారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీలో కనీసం చర్చకు కూడా రానివ్వరని మండిపడ్డారు.

చంద్రబాబుని పొగడటానికే అసెంబ్లీ..
చంద్రబాబు నాయుడుని పొగడటానికే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతీ శాసనసభ్యుడికి నిధులు కేటాయిస్తున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేల నియోజవర్గాలకు పైసా కూడా ఇవ్వడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం అప్రజాస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top