సాగునీరు కోసం వైఎస్సార్‌సీపీ నేతల రాస్తారోకో

YSRCP leaders Demand For KC Canal Water - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : కేసీ కెనాల్‌ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్‌ హైవేపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, అంజాద్‌ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top