తమ పార్టీ నాయకుడు బుగ్గవరపు శ్రీశైల వాసు హత్య వెనుక పలు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను అన్నారు.
నందిగామ: తమ పార్టీ నాయకుడు బుగ్గవరపు శ్రీశైల వాసు హత్య వెనుక పలు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను అన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే గన్ కల్చర్ తరహాలో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లా నందిగామలో శ్రీశైల వాసును మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చిచంపారు.