జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభా వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు.
తుపాను ప్రభావంపై వైఎస్ జగన్ ఆరా
Oct 13 2013 1:24 AM | Updated on Jul 25 2018 4:09 PM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభా వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజుతో శనివారం మధ్యాహ్నం ఫోన్‌లో మాట్లాడిన ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏఏ మండలాలు, గ్రామాలు తుపాను తాకిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు వైఎస్సార్ సీపీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడైనా తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని డెల్టా ప్రాంతం, మెట్ట ప్రాంతాల్లో తుపాను వల్ల పంట నష్టం జరిగిందా అని వాకబు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని జగన్ చెప్పినట్టు బాలరాజు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులంతా తుపాను పరిస్థితులపై జాగ్రత్త వహించాలని కోరారు.
దసరా శుభాకాంక్షలు
దసరా పండుగను జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ కోరారు.
Advertisement
Advertisement