అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన | Ysrcp leaders agitations on illegal arrrests | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన

Apr 16 2015 3:38 PM | Updated on Aug 29 2018 1:59 PM

వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసనగా రొద్దం పట్టణంలో ఆ పార్టీ నేతలు గురువారం మధ్యాహ్నం ధర్నాకు...

రొద్దం(అనంతపురం): వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసనగా రొద్దం పట్టణంలో ఆ పార్టీ నేతలు గురువారం మధ్యాహ్నం ధర్నాకు దిగారు.సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోరుతూ హిందూపురంలో గురువారం ఉదయం ఆందోళనకు దిగిన వైఎస్సార్ కాంగ్రెఃస్ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నవీన్‌నిశ్చల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం శంకరనారాయణను సోమందేవపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై రొద్దంలోని వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక చౌరస్తాలో గంటపాటు నిరసన తెలిపారు. తమ పార్టీ నేతల అరెస్టు అక్రమమని, వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement