వైఎస్ఆర్ సీపీ నేత తోట చంద్రశేఖర్ విరాళం | ysrcp leader thota chandrashekar donate Rs.15 lakh for hudhud cyclone victims | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత తోట చంద్రశేఖర్ విరాళం

Oct 18 2014 2:25 PM | Updated on May 29 2018 4:15 PM

హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట చంద్రశేఖర్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు.

హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట చంద్రశేఖర్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్  పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు స్పందించారు.  ఆ మేరకు తోట చంద్రశేఖర్ శనివారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి పదిహేను లక్షల చెక్కును అందించారు.

కాగా హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని,  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలరోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ.50 లక్షలు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement