అనంతలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య | ysrcp leader shot dead in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

Sep 1 2014 1:27 PM | Updated on Jul 30 2018 8:29 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ను సోమవారం దారుణంగా హత్య చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జ్యనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ను సోమవారం దారుణంగా హత్య చేశారు. టీడీపీ నాయకులే హత్యకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ విశ్వనాథ్ అక్కడికక్కడే మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement