'ప్రభాకర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి' | YSRCP Leader pardhasaradhi condemn attack on Woman Tahsildar | Sakshi
Sakshi News home page

'ప్రభాకర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి'

Jul 9 2015 1:48 AM | Updated on Apr 4 2019 12:50 PM

ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు.

ఏలూరు/నూజివీడు: మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై మంత్రి పీతల సుజాత స్పందించారు. సంఘటన తన దృష్టికి రాలేదని, విచారణంగా ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళా తహశీల్దార్ దాడి చేయడాన్ని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు.

మహిళా తహశీల్దార్ దాడిని వైఎస్సార్ సీపీ నాయకడు కె. పార్థసారధి ఖండించారు. దాడికి  పాల్పడిన ఎమ్మెల్యే, అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement