పిడుగురాళ్లలో వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా | ysrcp dharna at piduguralla police station | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా

Jun 15 2016 1:05 PM | Updated on May 29 2018 4:26 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు.

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుందుర్తి గురవాచారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టులో హాజరుపరచకుండా తిప్పుతున్నారని, అదుపులోకి తీసుకుని రెండు రోజులైనా అతని జాడ ఇంకా తెలియలేదని ఆందోళనకు దిగారు. గురజాలలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై గురువాచారి కోర్టులో పిల్ వేసిన సంగతి తెల్సిందే. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement