శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా? | YSRCP demands on voting on Telangana bill | Sakshi
Sakshi News home page

శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా?

Jan 27 2014 10:12 AM | Updated on Jul 29 2019 5:31 PM

శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా? - Sakshi

శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా?

సమైక్య తీర్మానం కోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎవరి నోటీసును పరిగణనలోకి తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : సమైక్య తీర్మానం కోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎవరి నోటీసును పరిగణనలోకి తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ విభజనవాదుల అంటూ తమను విమర్శించిన వారంతా ఇప్పుడు తమ బాటలోకే  వచ్చారని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి సంతకం అయిన తర్వాతే విభజన బిల్లు సభలోకి వచ్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు. బిల్లు తప్పుడు తడక అని అప్పుడు తెలిదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కిరణ్ చెప్పేవరకూ చంద్రబాబుకు ఈ సంగతి తెలియాదా అని మండిపడ్డారు. సభలో బిల్లు చర్చకు రావటానికి కిరణ్, చంద్రబాబే కారణమని శోభా నాగిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు సభలో శిఖండి పాత్ర పోషిస్తూ పైగా తమను విమర్శించటం దారుణమని ఆమె ధ్వజమెత్తారు. కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు  చేస్తున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement