భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి | ysrcp demands CBI enquiry into andhra pradesh capital land scam | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

Mar 2 2016 11:10 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ ఈ అంశంపై స్పందించాలన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై పరిణామాలు లజ్జాకరంగా ఉన్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేయడమంటే పౌరులకు గడ్డు కాలమే అని ఆయన అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement