అవినీతి ఆరోపణలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడింది నేనుకాదని కనీసం ఖండిచలేకపోయారని, నా ఫోన్‌ను ట్రాప్ చేశారని తన తప్పును ఒప్పకున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్ట్‌లు చేయడం, నిరసనను అడ్డుకోవడం తగదన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, జరజాపు సూరిబాబు, జరజాపు ఈశ్వరరావు, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడు గరుడబిల్లి ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి త్రినాథనాయుడు తదితరులు పాల్గొన్నారు.