11, 12, 13 తేదీల్లో వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం  | YSR Congress Party Samara Sankharavam at Anantha and Nellore and Prakasam | Sakshi
Sakshi News home page

11, 12, 13 తేదీల్లో వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం 

Feb 4 2019 2:46 AM | Updated on Feb 4 2019 2:46 AM

YSR Congress Party Samara Sankharavam at Anantha and Nellore and Prakasam - Sakshi

సమర శంఖారావం ఏర్పాట్లను పరిశీలిస్తున్న తలసిల రఘురాం, పెద్దిరెడ్డి, భూమన తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 11, 12, 13వ తేదీల్లో అనంతపురం, పీఎస్సార్‌ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరశంఖారావం సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ‘జగనన్న పిలుపు’అనే కార్యక్రమంలో భాగంగా తటస్తులైన ఓటర్లకు ఆయన ఇదివరకే లేఖలు రాసిన విషయం తెలిసిందే. తటస్తులు హాజరయ్యే ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ తొలుత పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత పోలింగ్‌ బూత్‌ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్‌ పాల్గొని, వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తారు.  

6, 7 తేదీల్లో చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 
ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 6న తిరుపతి (చిత్తూరు జిల్లా)లో సమరశంఖారావం సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 7న వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతాయి. ఈరెండు చోట్లా జగన్‌ పాల్గొని తటస్తులు, పార్టీ శ్రేణులతో విడిగా సమావేశమై ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement