చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే... | YSR Congress party MLAs takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే...

Jan 29 2014 10:38 AM | Updated on May 25 2018 9:12 PM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచనలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచనలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, కాపు రామచంద్రరెడ్డిలు ఆరోపించారు. బుధవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ...  బీఏసీకి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు డ్రామా లాడుతున్నారన్నారు.

 

అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసం చిత్తశుద్ధితో పోరాడుతుంది తమ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. రూల్ 77 కింద సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ మొదటి నుంచి పట్టుబడుతుందన్న సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విజభనపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement