రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జిల్లా
సమైక్య పోరుకు సిద్ధం కండి
Dec 10 2013 2:47 AM | Updated on Jul 25 2018 4:09 PM
సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి చేపట్టే ఆందోళనా కార్యక్రమాల వివరాలను సోమవారం ఆయన విలేకరులకు వెల్లడిం చారు. ప్రతి కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యవాదులను కలుపుకుంటూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. చిట్టబ్బాయి వెల్లడించిన ఆందోళనా కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువకులతో ర్యాలీలు
11న రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
12న అన్ని ప్రాంతాల్లోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు దిగ్బంధం. రోడ్లపై వంటావార్పు
14 నుంచి రోజుకో నియోజకవర్గంలో భారీఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు.
Advertisement
Advertisement