వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైజా విజయ భాస్కర్ రెడ్డి మృతికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం గిద్దలూరు బంద్కు పిలుపునిచ్చింది.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైజా విజయ భాస్కర్ రెడ్డి మృతికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం గిద్దలూరు బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఐ దురుసు ప్రవర్తనతో విజయ భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఏఎఎస్పీ రామ్ నాయక్ .... ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐ శ్రీనివాసరావును వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతున్నట్లు ప్రకటించారు. విచారణ జరిపి ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విజయ భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.