కృష్ణాలో నేడు విజయమ్మ పర్యటన | ys vijayamma tour krishna district today | Sakshi
Sakshi News home page

కృష్ణాలో నేడు విజయమ్మ పర్యటన

Oct 27 2013 12:52 AM | Updated on May 29 2018 4:06 PM

కృష్ణాలో నేడు విజయమ్మ పర్యటన - Sakshi

కృష్ణాలో నేడు విజయమ్మ పర్యటన

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె కృష్ణా జిల్లాలో వర్షాలు, వరదలకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. బాధితులతో స్వయంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పర్యటిస్తారని పార్టీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

 

నిజానికి ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భావించినప్పటికీ, హైదరాబాద్‌ను వీడి వెళ్లరాదన్న షరతుల కారణంగా పర్యటించలేకపోతున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement